విద్యార్థుల భద్రతే లక్ష్యం.. ‘పోలీస్ అక్క’తో అవగాహన
A2న్యూస్, జులై 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మనోహరాబాద్ (11) విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో మెదక్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన 'పోలీస్ అక్క' కార్యక్రమం కింద మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసు కానిస్టేబుల్ తస్లీమా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గుర్తింపు, సైబర్ నేరాల నుంచి రక్షణ, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించే విధానం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు,...