కొత్తపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ.. సంప్రదాయ పాటలతో మార్మోగిన గ్రామం A2న్యూస్, మనోహబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ)

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) అక్టోబర్ 19: శివంపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, బతుకమ్మ పాటలను భక్తిశ్రద్ధలతో ఆలపించారు. పూల సోయగాలు, మహిళల...