భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులకు సంపూర్ణ అవగాహన అవసరం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (8) భూ భారతి చట్టంలోని నిబంధనలు, రెవెన్యూ చట్టాలపై ప్రతి రెవెన్యూ అధికారి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులకు భూ భారతి చట్టంపై శిక్షణ, అవగాహనతో పాటు విధి నిర్వహణ బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణ, భూమి హక్కుల రికార్డు (ఆర్‌ఓఆర్),...