A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:41 am Posted by : A2TV NEWS

మెదక్‌లో రెడ్‌క్రాస్ ఎన్నికలు ప్రశాంతం

15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక

688 మందికి 295 మంది ఓటింగ్.. 42.88% పోలింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 5:

మెదక్ జిల్లా (4) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 688 మంది ఓటర్లకు గాను 295 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 42.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలైన ఓట్లలో 22 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తుది బరిలో ఉన్న అభ్యర్థుల్లో 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎన్నికల అధికారి, మెదక్ ఆర్డీవో డా. కె. రమాదేవి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులు, సిబ్బంది, ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.