A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 6:20 am Posted by : A2TV NEWS

సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ

జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు: కలెక్టర్ ప్రతిమాసింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28:

మెదక్ జిల్లా (27) సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే రాఖీ పండుగ సోదర భావాన్ని, పరస్పర ప్రేమానురాగాలను చాటిచెబుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా పండుగను జరుపుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకాంక్షించారు.