A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 13:
నర్సాపూర్ (12) రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని స్నేహ పూరిత భావంతో కలిసిమెలిసి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ కం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీచైర్మన్ఎం.హేమలత సూచించారు. శనివారం నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీఆధ్వర్యంలో, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్నినిర్వహించడం జరిగిందని అన్నారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పుఅని, ఇరువర్గాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని స్నేహ పూరిత భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కోర్టు ఏ జి పి డి.శ్రీధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాస్ గౌడ్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ శాస్త్రులమధుశ్రీశర్మ, లీగల్ సర్వీస్ న్యాయవాది కాట్రోత్.రాజు నాయక్, కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి, చిలప్ చెడు ఎస్సై నర్సింలు, సీనియర్ న్యాయవాది ఆర్. శ్రీనివాస్ రెడ్డి, ఈ.సత్యనారాయణ, సి.హెచ్.స్వరూపరాణి, పి.సుధాకర్,న్యాయవాదులు నాగరాజు,జాట్రోత్ రవినాయక్, ఏ.సాయిరాం, బి.మానయ్య, నీలవేణి, కోర్టు సూపర్డెంట్ ఎం.ఎల్. సూర్య ప్రకాష్, లీగల్ సర్వీస్ టైపిస్ట్ కంఅసిస్టెంట్ కే.సుభాష్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీస్ కోర్టు సిబ్బంది, కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్, హరిబాబు గౌడ్, దిలీప్ గౌడ్, శ్రీనివాస్, ఆనంద్, కక్షిదారులు పాల్గొనడం జరిగింది.