కేసుల దర్యాప్తులో నాణ్యతకు పెద్దపీట వేయాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
సాంకేతికతతో సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి – పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (27) కేసుల దర్యాప్తులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు....