నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మనోహరాబాద్, జూన్ 23: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించి, వివిధ స్టాళ్లలో ప్రదర్శించిన వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన అన్ని...