సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన పోలీసింగ్ అందించాలి

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమగ్ర తనిఖీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9: మనోహరాబాద్ (8) ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని మల్టీ జోన్–I ఐజీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు....