A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:33 am Posted by : A2TV NEWS

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్ట్ 4:

మెదక్ జిల్లా (3) ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 57 దరఖాస్తులు అందగా, వాటిలో భూభారతి సంబంధిత 14, పెన్షన్లకు సంబంధించిన 7, హౌసింగ్‌కు సంబంధించిన 6, ఇతర సమస్యలకు సంబంధించిన 30 దరఖాస్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.