A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:16 am Posted by : A2TV NEWS

పోతారం గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 18:

మనోహరాబాద్ (17) మనోహరాబాద్ మండలం   పోతారం గ్రామంలో,గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను వివరించారు. తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా ఉండి, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్మడి దుర్గమ్మ, వార్డు సభ్యులు మంద యాదగిరి, మన్నె సురేష్, చెలిమెల పవన్ గౌడ్, సంకీ శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిత, సీఏ దుర్గం కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ కత్తి నరసింహులుతో పాటు గ్రామ ప్రజలు వడ్ల సత్య, చెలిమెల మల్లేష్ గౌడ్, పుట్ట కుమార్, మాస్కురి శ్రీనివాస్, పంజాల నాగరాజు గౌడ్, సంకీ లక్ష్మణ్, తలారి శ్రీకాంత్, చెలిమెల రాకేష్ గౌడ్, తలారి ప్రశాంత్, చెలిమెల ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.