మెదక్ జిల్లాలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఫామ్ పాండ్స్ నిర్మాణంతో రైతులకు ప్రయోజనం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 17: మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించేందుకు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ...