కోతుల బెడదకు చెక్‌.. ఉద్యమంలా నివారణ చర్యలు

జిల్లాలో 6,500 కోతులు ఉన్నట్లు అంచనా.. మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12: మెదక్ జిల్లా (11) కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కోతుల నియంత్రణ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన, ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమీక్ష...