నవరాత్రి ఉత్సవాల నిర్వాహకుల సన్నాహక సమావేశం

A2న్యూస్,తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం) సెప్టెంబర్ 10: తూప్రాన్ (9) వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్స్‌లో వినాయక ఉత్సవాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్,శివ్వంపేట్, వెల్దుర్తి, మండలాలకు చెందిన వినాయక ఉత్సవాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, వినాయక ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, శాంతిభద్రతల...