గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 16: చేగుంట (15) గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ముఖ్యంగా నెలలు నిండుతున్న గర్భిణీలు, హైరిస్క్ గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని...