A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:03 am Posted by : A2TV NEWS

మనోహరాబాద్ ఎంపీడీవోగా ప్రీతి రెడ్డి బాధ్యతల స్వీకరణ

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 17:

మనోహరాబాద్ (16) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) ప్రీతి రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవోగా నియమితులైన అనంతరం ఆమె సెలవుపై వెళ్లడంతో ఇంతకాలం ఇన్‌చార్జి ఎంపీడీవోగా కృష్ణమూర్తి విధులు నిర్వహించారు. బుధవారం కృష్ణమూర్తి నుంచి ప్రీతి రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మండల అభివృద్ధి కార్యక్రమాలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.