ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8: మెదక్ జిల్లా (7) ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 61 దరఖాస్తులు అందాయి. వీటిలో భూభారతికి సంబంధించి...