బ్రిడ్జిల వద్ద గుంతల మయం.. ప్రమాదాలకు ఆహ్వానం!
చేగుంట–బోనాల రహదారిపై వాహనదారుల అవస్థలు.. అధికారులు ఇకనైనా మేల్కొనాలి A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 15 : చేగుంట(14) మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని చేగుంట–అనంతసాగర్–రుక్మాపూర్–ఇబ్రహీంపూర్–బోనాల మార్గంలో రహదారి అధ్వానంగా మారి వాహనదారులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా బ్రిడ్జిల వద్ద ఏర్పడిన భారీ గుంతలు వర్షాలకు మరింత లోతుగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. బ్రిడ్జిల వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు ప్రత్యక్ష ఆహ్వానం పలుకుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు...