ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18: మెదక్ జిల్లా (17) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు....