జూదంపై పోలీసుల దాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.10,587 నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం

A2 న్యూస్ జూన్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) తూప్రాన్ 19, తూప్రాన్‌లో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,587 నగదు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, తూప్రాన్‌లోని గీతా స్కూల్ వెంచర్ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం దాడి చేపట్టింది. ఈ దాడిలో మల్లబోయిన గణేష్, ఇటుక్యాల రేవంత్...