భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ భారతి విజయవంతమైన అమలుకు రీ-సర్వే కీలకం – మార్చి 2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని ఆదేశం A2న్యూస్, జూలై 12, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (11) రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే, భూ భారతి...