వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30: మెదక్ జిల్లా (29) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వర్షాల పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాడుబడిన ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లను...