పటిష్ఠ బందోబస్తుతో ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబీ
పోలీసుల భద్రతా చర్యలకు అభినందనలు.. ఎస్పీని సన్మానించిన జమాత్-ఇ-ఇస్లామీ ప్రతినిధులు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా (9) మిలాద్-ఉన్-నబీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు విజయవంతం కావడంతో జమాత్-ఇ-ఇస్లామీ ప్రతినిధులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పండగ సందర్భంగా ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ...