పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వినాయక నిమజ్జనాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18: మెదక్ జిల్లా (17) వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. నిమజ్జన కార్యక్రమాలకు వెళ్లే సమయంలో పిల్లలను చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జన ప్రదేశాల్లో పిల్లలను ఎప్పటికప్పుడు తమ వెంట...