A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:11 am Posted by : A2TV NEWS

అంతర్జాతీయ పర్యావరణ స్నేహిత బహుళప్రయోజన సంస్థ తెలంగాణరాష్ట్రఅధ్యక్షులుగా పి.సి.ఆదిత్య

A2న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) జులై 28:

హైదరాబాద్ (27) అంతర్జాతీయ పర్యావరణ స్నేహిత బహుళప్రయోజన సంస్థతెలంగాణరాష్ట్రఅధ్యక్షులుగా పి.సి.ఆదిత్య స్నేహితులయ్యారు. డిల్లీ ప్రధానకేంద్రంగాపర్యావరణ పరిరక్షణ కు అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న ఈ సంస్థ తెలుగు సినిమా రంగంలోనిత్యప్రయోగశిలిగా పేరుపొందిన ప్రముఖ సీనియర్ దర్శకులు డాక్టర్ పి.సి. ఆదిత్యను తమ సంస్థకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్థూ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవా తంబే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకృతి ప్రేమికుడు పీసీ ఆదిత్య తాను తీసే సినిమాలలో , లఘు చిత్రాలలో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తన వంతు కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక నియామకం చేస్తున్నట్లు దేవా తంబే ప్రకటించారు. ఈ సందర్భంలో ఆదిత్య స్పందిస్తూ పర్యావరణ పరిరక్షణలో తన సేవలు గుర్తించి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, పర్యావరణం పరిరక్షణ పై అందరూ అవగాహన కలిగి తమ వంతు ప్రయత్నం చేయాలని, భవిష్యత్ లో తాను నిరంతర ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిత్య కు మిత్రులుఅభిమానులుశుభాకాంక్షలు తెలిపారు.