A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 6:08 am Posted by : A2TV NEWS

ఈనెల 21న టిఆర్ పి అధినేత పర్యటన..

పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మంకిడి రాములు 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 18:

నర్సాపూర్ (17)  ఈనెల 21న శుక్రవారం టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటన కార్యక్రమం ఉంటుందని నర్సాపూర్ తాలూకా పార్టీ ఇంచార్జి మంకిడి రాములు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  21న శుక్రవారం 9 గంటలకు మనోహరాబాద్, శివంపేట్, నర్సాపూర్, రుస్తుంపేట, అనంతరం ఎం.జి.పి గురుకుల పాఠశాల సందర్శన ఉంటుందని తెలిపారు. తర్వాతఉదయం11:15కు మహమ్మద్ నగర్, కౌడిపల్లి, కొల్చారం, మంబోజిపల్లి, మధ్యాహ్నం మెదక్ టౌన్, రామాయంపేట,నిజాంపేట్ (డి)ధర్మారం, కిష్టాపూర్ బోనాల, పోతంపల్లి గ్రామాల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పర్యటన విజయవంతం చేయాలని ఆయన కోరారు.