A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:11 am Posted by : A2TV NEWS

ప్రజావాణిలో సమస్యలపై అధికారుల స్పందన

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ (29)

మనోహరాబాద్ (28)  మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 14 మంది అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో ప్రీతిరెడ్డి తెలిపారు. అందిన దరఖాస్తుల్లో 4 రెవెన్యూ శాఖకు, 2 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.