A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:58 am Posted by : A2TV NEWS

వాటర్ ఫౌంటెన్ కాదు…మిషన్ భగీరథ నీరు..!

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 1:

నర్సాపూర్ (30) చిత్రంలో కనిపిస్తున్నది వాటర్ ఫౌంటెన్ కాదు. వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు. నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రోడ్డులో గల రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో ఇలా నీరు వృధాగా వాటర్ ఫౌంటెన్ తలపించేలా అధిక మొత్తంలో నేలపాలయ్యింది. ఇంతకుముందు కూడా ఇలాగే లీకేజీ అయి నీరు వృధాగా పోయినా సంబంధిత అధికారులు శాశ్వత చర్యలు చేపట్టక పోవడం వల్ల ఇలాంటి సమస్యలుఉత్పన్నమవుతున్నాయని పలువురు అంటున్నారు. ఇకనైనా ఇలాంటి లీకేజీలు ముందు ముందు కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.