ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి – ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8: మెదక్ జిల్లా(7)ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ...