A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:39 am Posted by : A2TV NEWS

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:

మెదక్‌ జిల్లా (7) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ జాబితాల్లో నోటీసులు జనరేట్‌ అయిన ఓటర్లకు నోటీసులు అందజేయడం, హియరింగ్‌ నిర్వహించడం, ఆమోదించిన దరఖాస్తులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ జాబితాల్లో నోటీసులు నమోదైన వాటిని సంబంధిత ఓటర్లకు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈఓ ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారికి నిబంధనల ప్రకారం హియరింగ్‌ నిర్వహించి, వారు సమర్పించిన ధ్రువపత్రాలను బీఎల్‌ఓల ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేయడంతో పాటు హియరింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అథారిటీ సూచించిన నిబంధనల మేరకు హియరింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండెంట్‌ గఫర్‌, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.