భూ రీసర్వే గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి నూతన సాఫ్ట్వేర్– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ జిల్లా (1) భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నూతన డిజిటల్ సాఫ్ట్వేర్‌ను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్ఐసి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్‌పై జాయింట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) లక్ష్మీప్రసన్న, ఎన్ఐసి సైంటిస్ట్ సి.సి. సంధ్య, ఏడీ ల్యాండ్ రికార్డ్స్ కిషన్ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...