నిత్య విద్యార్థిగా ఉండాలి జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 3: నర్సాపూర్ (2) వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవడం అవసరమని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మిఅన్నారు. నర్సాపూర్‌లో ని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఆదివారం నిర్వహించిన 26వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగ్రాడ్యుయేషన్ అనేది సంవత్సరాల కృషి, పట్టుదల, అంకితభావానికి లభించిన...