A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:59 am Posted by : A2TV NEWS

నిత్య విద్యార్థిగా ఉండాలి జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 3:

నర్సాపూర్ (2) వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవడం అవసరమని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మిఅన్నారు. నర్సాపూర్‌లో ని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఆదివారం నిర్వహించిన 26వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. ఎ. జయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగ్రాడ్యుయేషన్ అనేది సంవత్సరాల కృషి, పట్టుదల, అంకితభావానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రులు నిశ్శబ్ద శిల్పులుగా నిలుస్తారని కొనియాడుతూ,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ జీవితంలో విజయాన్ని సాధించాలంటే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారగల నైపుణ్యం, విభిన్న రంగాల పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకునే దృక్పథం అనే మూడు కీలక లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకో సిస్టమ్ ద్వారా ఎదుగుతున్న విద్యార్థి పారిశ్రామికవేత్తలను అభినందిస్తూ, బీవీఆర్ఐటీ తన పూర్వ విద్యార్థులకు భవిష్యత్తులో కూడా అన్ని విధాలాఅండగానిలుస్తుందనిహామీఇచ్చారు.బీవీఆర్ఐటీ డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ, నిరంతరం తమవిజ్ఞానం,నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, పరిశోధన ప్రచురణలు, ఆవిష్కరణల రంగాల్లో విద్యార్థులు కొత్త మైలురాళ్లు నెలకొల్పారని అభినందించారు. అనంతరం పట్టభద్రులకు స్వాగతం పలికి, 26వ స్నాతకోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ స్నాతకోత్సవంలో యూజీ, పీజీ కోర్సులకు చెందిన మొత్తం 1,510 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యా రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల టాపర్ విద్యార్థులకు స్వర్ణ పతకాలుఅందజేశారు.పద్మభూషణ్ డా. బి.వి. రాజు మెమోరియల్ అవార్డు–2026ను బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన శ్రీ గడ్డం సాయి లిఖిత్ కుమార్ రెడ్డి అందుకున్నారు.అలాగే బెస్ట్ అవుట్ గోయింగ్ అకడమిక్అవార్డు–2026ను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన గోపిశెట్టి సౌమ్య అందుకున్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాపర్ విద్యార్థులను ముఖ్య అతిథులు సత్కరించి స్వర్ణ పతకాలు, అవార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కాంతారావు,అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ సురేష్,కళాశాలడీన్స్, వివిధ విభాగాధిపతులు, ప్లేస్‌మెంట్ అధికారి డా. జె. బంగార్రాజు, పరీక్షల చీఫ్ కంట్రోలర్ డా. కాపుల ప్రభాకరరావు,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ అకడమిక్ వస్త్రధారణలో హాజరైన పట్టభద్రులు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు