A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:59 am Posted by : A2TV NEWS

లేబర్ కొడ్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమం: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 11:

నర్సాపూర్ (10) పేదల పొట్టలు గొట్టి సంపన్నులకు సేవలు చేస్తున్న మోడీ నిరంకుశ విధానాలపై లేబర్ కొడ్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు హెచ్చరించారు.  కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సంఘాల జైల్ భరో జాతీయ పిలుపులో భాగంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాప్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలపై దేశ వ్యాప్త ఉద్యమం చేస్తున్నామని, 12 ఏండ్ల నుండి దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ దేశ సంపదనుపెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని అన్నారు. మతోన్మాద, కార్పొరేట్ విధానాలు అమలు చేసి ప్రజలపై భారాలు వేసే హక్కు మోడీకి ఎక్కడిదని ప్రశ్నించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కొడ్స్ ఎవ్వరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కొడ్స్ అమలు చెయడం అంటే కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెట్టడమేఅవుతుందని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేట్ చేసి రైతులపై భారం వేయాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలనుతిప్పికొడుతామణి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయకుండా మోడీనిరుద్యోగయువతను మోసం చేస్తున్నారని అన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, రమేష్, రాములు, అశోక్, నర్సింలు, శంకర్, పుష్ప, లక్ష్మి, షూఖుర్ తదితరులు పాల్గొన్నారు.