A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 5:17 am Posted by : A2TV NEWS

తొనిగండ్లలో మహిళా సమైక్య భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రామాయంపేట (29) మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సమైక్య భవనం ద్వారా మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాల నిర్వహణకు అనువైన వేదిక లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ మహిళల చిరకాల కోరికను నెరవేర్చుతూ మహిళా సమైక్య భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్‌కు గ్రామ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.