ఏడాదిలోగా మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తి చేయాలి

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4: మెదక్ జిల్లా (3) గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఏడాదిలోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోఠిలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో గురువారం మెదక్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పురోగతి, మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పనితీరుపై...