రాష్ట్రస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ కప్‌లో మెదక్ బాలికల జట్టుకు ద్వితీయ స్థానం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13: మెదక్ జిల్లా (12)రాష్ట్రస్థాయి అండర్‌–17 బాలికల సుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు సత్తాచాటింది. పాఠశాల క్రీడా సమాఖ్య తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన పోటీల్లో మెదక్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ఎస్. రాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో బాలికల జట్టు...