ఎస్సై ఆధ్వర్యంలోవినాయక నవరాత్రి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం … పాల్గొన్న మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ రూరల్ సీఐ కృష్ణమూర్తి

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 10 :   మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎస్సై మొయినుద్దీన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, రూరల్ సీఐ  కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎస్సైమొహినుద్దీన్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తుశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అనుమతి లేని కార్యక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. ...