పురాతన, వారసత్వ సంపదకు నిలయం మెదక్ జిల్లా: మంచు విష్ణు
టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏడుపాయలు, మెదక్ ఖిల్లా, సీఎస్ఐ కేథడ్రల్ సందర్శన A2న్యూస్, జులై 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (18) మెదక్ జిల్లా పురాతన, చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమని మా అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు, హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత మంచు విష్ణు అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. ఏడుపాయలకు చేరుకున్న మంచు విష్ణుకు అదనపు కలెక్టర్ నగేష్ మొక్కను అందించి ఘనంగా స్వాగతం...