గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 13: నర్సాపూర్ (12) విద్యార్థుల విజ్ఞాన సముపార్జన, అకడమిక్ అభివృద్ధిలో గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తుందని బీవీఆర్‌ఐటీ ప్రిన్సిపాల్‌ డా. సంజయ్‌ దూబే అన్నారు. బుధవారం బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) సరస్వతి బ్లాక్‌లోని సెంట్రల్‌ లైబ్రరీలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా.ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ జయంతినిపురస్కరించుకుని 134వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. సంజయ్‌ దూబే మాట్లాడుతూ గ్రంథాలయంలోని పుస్తకాలు, ఈ-వనరులు, ఇతర సమాచార వనరులను విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. అనంతరం...