A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) జూలై 29:
నర్సాపూర్ (28) రాష్ట్రవ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మరియు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట్, సిరిసిల్ల, జనగాం, కరీంనగర్, హనుమకొండ, వరంగల్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద, చెట్లకిందనిలబడకూడదని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.