A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:07 am Posted by : A2TV NEWS

పారిశ్రామిక కారిడార్ కోసం భూసేకరణ చేపట్టాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:

మెదక్ జిల్లా(5) జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక కారిడార్ కోసం చేపట్టాల్సిన భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మాసాయిపేట, మెదక్, శంకరంపేట మండలాల్లో పారిశ్రామిక కారిడార్‌కు అవసరమైన భూములను గుర్తించి, భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు స్థానికంగా యువతీ యువకులకు ఉపాధి, జీవనోపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ గూగుల్ మీట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, టీజీఐఐసీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.