పారిశ్రామిక కారిడార్ కోసం భూసేకరణ చేపట్టాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా(5) జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక కారిడార్ కోసం చేపట్టాల్సిన భూసేకరణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, మాసాయిపేట, మెదక్, శంకరంపేట మండలాల్లో పారిశ్రామిక కారిడార్‌కు అవసరమైన భూములను గుర్తించి, భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్...