A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:10 am Posted by : A2TV NEWS

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి కొండాపూర్ సర్పంచ్ రాము యాదవ్ పిలుపు

A2న్యూస్, జూలై 19, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ)

మనోహరాబాద్(18) ఓటరు సర్వేలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా గ్రామస్తులు చొరవ చూపాలని మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ రాము యాదవ్ సూచించారు. ఆయన A2 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), అంగన్‌వాడీ సిబ్బందికి గ్రామస్తులు పూర్తి సహకారం అందించి, తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు. అలాగే, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు తప్పనిసరిగా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారు తమ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరణలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవి వెంకటేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.