A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:39 am Posted by : A2TV NEWS

రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ చేపట్టిన పాదయాత్ర కు స్వాగతం పలికిన జగ్గారెడ్డి

దేశ ప్రజలు సంతోషంగా, సంక్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావడమే మన ముందున్న లక్ష్యం

 

A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18:

సంగారెడ్డి జిల్లా (17)  ఇప్పటికే 4 రాష్ట్రాల్లో 1590 కిలోమీటర్లు నడిచి వేలాది మందిని స్వయంగా కలిశారు.కాశ్మీర్ కు చేరుకునే వరకు లక్షల మందిని కలుస్తారు పాదయాత్ర పూర్తికాగానే వెంకటేశ్వర్లును తీసుకెళ్లి స్వయంగా నేనే రాహుల్ గాంధీని కలిపిస్తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో ఒంగోలుకు చెందిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది దేశం లోని సామాన్య ప్రజలందరి అభిప్రాయం అని, అదే వెంకటేశ్వర్లు పాదయాత్ర లో సైతం వ్యక్తం అవుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వెంకటేశ్వర్లు ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల మీదుగా సుమారు 1,590 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. తన ప్రయాణంలో భాగంగా హోటళ్లు, రహదారుల వెంట ఉన్న టీ స్టాళ్లు, పొలాలు, పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో సామాన్య ప్రజలను కలుసుకుంటూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 30 వేల మందిని కలిసిన వెంకటేశ్వర్లు తన పాదయాత్ర అనుభవాలను తనతో పంచుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు. దేశ ప్రజలతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందని వెంకటేశ్వర్లు చెప్పారని అన్నారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ పాదయాత్ర మొత్తం సుమారు 4,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని, ఈ ప్రయాణంలో రెండు లక్షలకు పైగా ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు జగ్గారెడ్డి వివరించారు.దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలు, దేశం కోసం ఆయన కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలకు వివరిస్తూ వెంకటేశ్వర్లు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలు సంతోషంగా, సంక్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చేపట్టారని పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తయిన అనంతరం వెంకటేశ్వర్లును స్వయంగా తీసుకెళ్లి రాహుల్ గాంధీని కలిపిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.