ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై: 28 మెదక్ జిల్లా (27)  జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల సమస్యలను అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హమైన వాటికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా...