A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 5:58 am Posted by : A2TV NEWS

నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ ప్రతిమ సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28:

మెదక్ జిల్లా (27) నూతన చేయూత పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా చేయూత పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని లబ్ధిదారులు సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని తక్షణమే పొందేలా ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాల జారీ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. పింఛన్ల దరఖాస్తుల విషయంలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తులు సమర్పించి చేయూత పింఛన్ ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ కోరారు.