బీవీఆర్ఐటీలో ఎం.టెక్ ఫ్రెషర్స్ ఇండక్షన్
A2న్యూస్,నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 6: నర్సాపూర్ (5) బీవీఆర్ఐటీ లో ఎం.టెక్ ప్రథమ సంవత్సరం నూతన విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె. విష్ణు రాజు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరిశ్రమలతో అనుసంధానమై నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు, బీవీఆర్ఐటీ పూర్వ విద్యార్థుల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. బీవీఆర్ఐటీ పలు ప్రముఖ పరిశ్రమలు, ఈవీటీ టెక్నాలజీస్, ఇంజినీరింగ్...