A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 7:58 am Posted by : A2TV NEWS

బీవీఆర్‌ఐటీలో ఎం.టెక్‌ ఫ్రెషర్స్‌ ఇండక్షన్‌

A2న్యూస్,నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 6:

నర్సాపూర్‌ (5) బీవీఆర్‌ఐటీ లో ఎం.టెక్‌ ప్రథమ సంవత్సరం నూతన విద్యార్థుల ఇండక్షన్‌ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌ కె. విష్ణు రాజు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరిశ్రమలతో అనుసంధానమై నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు, బీవీఆర్‌ఐటీ పూర్వ విద్యార్థుల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. బీవీఆర్‌ఐటీ పలు ప్రముఖ పరిశ్రమలు, ఈవీటీ టెక్నాలజీస్‌, ఇంజినీరింగ్‌ డిజైన్‌ సంస్థలతో అకడమిక్‌–ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ భాగస్వామ్యాల ద్వారా ఎం.టెక్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలతో పరిశోధన, అకడమిక్‌ సహకారాన్ని అందిస్తున్నామని, క్యాంపస్‌లోని ఆధునిక పరిశోధనా ప్రయోగశాలలు, ఇతర సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డా. కె. లక్ష్మీ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ డా. సంజయ్‌ దూబే, ఇండస్ట్రీ రిలేషన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ డా. వంశీకృష్ణ, అకడమిక్ డీన్ డా. మురళికృష్ణ, డీజీఎం కాంతారావు, కళాశాల మేనేజర్‌ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సురేష్‌, వివిధ విభాగాధిపతులు, డీన్లు, పీజీ కోఆర్డినేటర్లు, ఎం.టెక్‌ నూతన విద్యార్థులు పాల్గొన్నారు.