కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 186 దరఖాస్తులు – 102 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30:
మెదక్ జిల్లా (29) మెదక్ ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా గురువారం మెదక్ పట్టణంలోని సీడీపీఓ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించినట్లు మెదక్ సీడీపీఓ వెంకటరమణమ్మ తెలిపారు. మొత్తం 5 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 186 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 102 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని ఆమె వెల్లడించారు. కొల్చారం మండలంలోని 2 పోస్టులకు 74 మంది దరఖాస్తు చేసుకోగా, 38 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అలాగే పాపన్నపేట మండలంలోని 3 పోస్టులకు 112 మంది దరఖాస్తు చేయగా, 64 మంది తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌కు సమర్పించినట్లు తెలిపారు. భర్తీ జరుగుతున్న పోస్టుల్లో కొల్చారం మండలంలోని రంగంపేట–2, కొంగోడ్ సెంటర్–2, పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి సెంటర్–2, అర్కెల సెంటర్–2, లక్ష్మీనగర్ తండా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని సీడీపీఓ వెంకటరమణమ్మ వివరించారు. అంగన్‌వాడీ పోస్టులకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించడం గమనార్హమని ఆమె పేర్కొన్నారు.